ETV Bharat / crime

Accident kadapa: కడప జిల్లాలో వ్యాన్​ బీభత్సం.. నలుగురు దుర్మరణం

Accident kadapa: వారంతా పనులు ముగించుకొని ఇంటి ముందు కూర్చున్నారు. కాలక్షేపం కోసం పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఇలా కొంత సేపు గడిచింది. కానీ అనుకోని మృత్యువు వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. ఈ ఘటన ఏపీ లోని కడప జిల్లాలో చోటుచేసుకుంది.

author img

By

Published : Mar 2, 2022, 3:01 PM IST

Accident in Kadapa district
కడప జిల్లాలో ప్రమాదం

Accident kadapa: ఏపీ లోని కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం మద్దిమడుగులో విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు గడపలో కూర్చున్న వారి మీదకు బొలేరో వాహనం వేగంగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా... కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో ఇద్దరు మరణించారు. మృతులు దేవి(27), అమ్ములు(30), కొండయ్య(45), లక్ష్మీదేవి(35)గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Road accidents in Telangana Today: రాష్ట్రంలో రక్తమోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.