నిర్మల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఏసీబీ దాడుల్లో ఎంపీఓతో పాటు పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో అనిశా అధికారులు దాడులు చేశారు.
నిర్మల్ జిల్లా అనంతపేట గ్రామం ఎదులాపురం శివారులో 13 ఎకరాల భూమిని లేఅవుట్ చేసేందుకు వరంగల్ నుంచి యజమానులు అనుమతి తీసుకున్నారు. అయితే లేఅవుట్ చేయడానికి 15 శాతం భూమిని గ్రామపంచాయతీకి మార్టిగేజ్ చేసే విషయంలో ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి (2లక్షలు), పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ(లక్షన్నర)తో పాటు సర్పంచ్ భర్త నేరెళ్ల అశోక్(3లక్షలు) మొత్తం ఆరున్నర లక్షల రూపాయలు డిమాండ్ చేశారు.
మొదటి విడతగా రూ.2.70 లక్షలు చెల్లించడానికి ఒప్పుకున్న సదరు భూ యజమానులు శ్రీనివాసరావు, నరేశ్ రెడ్డి.. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ప్రణాళిక ప్రకారం అనిశా అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. నిందితులను బుధవారం కరీంనగర్ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలి: జానారెడ్డి