వికారాబాద్ జిల్లా దోమ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఐనాపూర్ గ్రామానికి చెందిన అరీఫ్ పాషాకు చెందిన మూడు ఎకరాల భూమిని సర్వే చేయడానికి సర్వేయర్ భాగ్యవతికి అర్జీ పెట్టుకోగా.. లాక్డౌన్ నుంచి తిప్పుతున్నారని బాధితుడు ఆరోపించారు.
"పలుమార్లు కార్యాలయానికి తిరగగా డిసెంబర్ నెలలో నామమాత్ర సర్వే చేసి పదివేలు రూపాయలు డిమాండ్ చేశారు. అంత డబ్బులు ఇచ్చుకోలేనని చెప్పి రెండు వేలు ఇచ్చాను. మరో 3 వేలు డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్‌కు డబ్బులు ఇవ్వు.. తన దగ్గర తీసుకుంటానని సర్వేయర్ చెప్పారు."
- అరీఫ్ పాషా, బాధితుడు
కంప్యూటర్ ఆపరేటర్ ప్రేమ్‌కు మూడు వేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు గంగాధర్, రామలింగారెడ్డి, ప్రశాంత, సిజిత, రాజేశ్ రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
ఇదీ చూడండి: ఏటీఎంల వద్ద మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్