ACB Caught Sub Registrar: హైదరాబాద్ బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ నిజాముద్దీన్ కోటి 8లక్షల రూపాయల అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు అనిశా అధికారులు తెలిపారు. నిజాముద్దీన్, అతని కుటుంబ సభ్యుల పేరు మీదు స్థిర చరాస్తులు కొనుగోలు చేసినట్లు అనిశా అధికారులు గుర్తించారు. ఓ వ్యక్తికి చెందిన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయడానికి నిజాముద్దీన్ 75వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించాడు.
అనిశా అధికారులు గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన వల వేసి సబ్ రిజిస్ట్రార్ నిజాముద్దీన్తో పాటు డాక్యుమెంట్ రైటర్ జియాఉద్దీన్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత నిజాముద్దీన్ ఇల్లు, కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు అనిశా అధికారుల దర్యాప్తులో తేలింది.
ఇదీ చదవండి: