ETV Bharat / crime

ఏసీబీ వలకు చిక్కిన ఎస్​ఆర్​‌నగర్‌ ఎస్సై - ఏసీబీ వలలో ఎస్‌.ఆర్‌.నగర్‌ ఎస్సై వార్తలు

అనిశా వలలో ఎస్‌ఆర్‌నగర్‌ ఎస్‌ఐ
అనిశా వలలో ఎస్‌ఆర్‌నగర్‌ ఎస్‌ఐ
author img

By

Published : Feb 22, 2021, 7:29 PM IST

Updated : Feb 22, 2021, 8:02 PM IST

19:27 February 22

ఏసీబీ వలకు చిక్కిన ఎస్​ఆర్​‌నగర్‌ ఎస్సై

హైదరాబాద్ ఎస్​ఆర్​నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోన్న ఎస్సై భాస్కర్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఓ ఆటో డ్రైవర్‌ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఓ చౌక ధరల దుకాణానికి చెందిన గోధుమలను బయట విక్రయించేందుకు ఆటో తరలిస్తుండగా అమీర్‌పేట్‌ సెక్టార్‌లో పని చేస్తోన్న ఎస్సై భాస్కర్ పట్టుకున్నారు. ఆటోను స్వాధీనం చేసుకుని.. ఎస్​ఆర్​నగర్ ఠాణాకు తరలించారు.

ఈ క్రమంలోనే ఆటోను డ్రైవర్‌కు అప్పగించడానికి ఎస్సై భాస్కర్ రూ.25 వేలు లంచం డిమాండ్‌ చేశారు. లంచం ఇవ్వలేని బాధితుడు తమను ఆశ్రయించగా.. వలపన్ని పట్టుకున్నామని అనిశా అధికారులు పేర్కొన్నారు. విచారణ ఠాణాలోనే కొనసాగుతుందని.. పూర్తి వివరాలు త్వరలోనే అందిస్తామని వివరించారు.

ఇదీ చూడండి: హైకోర్టు న్యాయవాది దుర్గాప్రసాద్‌ కారును ఢీకొట్టిన లారీ

Last Updated : Feb 22, 2021, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.