వనపర్తి జిల్లా అటవీశాఖ అధికారి(DFO) బాబ్జీరావు అనినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన నాగరాజు అనే మొక్కల వ్యాపారి నుంచి రూ.3 లక్షల లంచం తీసుకొంటూ పట్టుబడ్డారు.
ఏపీలోని అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన నాగరాజు.. పీఎన్ఆర్ సీడ్స్ పేరిట మొక్కల వ్యాపారం చేస్తున్నారు. వనపర్తి జిల్లాలోని నర్సరీలకు మొక్కలు సరఫరా చేశారు. ఇందుకు బిల్లులు మంజురు చేయాల్సి ఉండగా.. డీఎఫ్వో బాబ్జీరావు లంచం డిమాండ్ చేశారు. తొలుత ఏడు లక్షలు లంచం డిమాండ్ చేశారు. అనంతరం నాలుగు లక్షల 20 వేలు ఇవ్వాలని పట్టుబట్టారు. డీఎఫ్వో తీరుతో విసిగిపోయిన.. మొక్కల వ్యాపారి నాగరాజు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. ఇవాళ మూడు లక్షల రూపాయల లంచం తీసుకొంటుండగా.. రెడ్హ్యాండడ్గా పట్టుకున్నారు.
బాబ్జీరావు నుంచి మూడు లక్షలను స్వాధీనం చేసుకున్న అధికారులు... కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇప్పటికి రెండుసార్లు లంచం ఇచ్చా..
పీఎన్ఆర్ సీడ్ పేరిట హరితహారం, ఇతర కార్యక్రమాలకు మొక్కలు సరఫరా చేస్తాం. జనవరిలో మొక్కలు సరఫరా చేస్తే ఇప్పటికీ బిల్లు ఇవ్వలేదు. మొక్కకు 9 రూపాయల అరవై పైసలకు ప్రభుత్వం అంగీకారం తెలిపాక.. ఏడున్నర లక్షల ఇవ్వమన్నారు. తర్వాత 7 రూపాయలకు రేటు తగ్గిందని చెప్పి.. నాలుగున్నర లక్షలు ఇవ్వమన్నారు. ఆఖరికి మూడు లక్షలు ఇచ్చేందుకు అంగీకరించాను. అనంతరం అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు డీఎఫ్వోకు రెండుసార్లు లంచం ఇచ్చా.
- నాగరాజు, ఫిర్యాదుదారుడు
ఇదీచూడండి: 'నేను చెప్పినట్టు చేస్తారా... గన్నుకు పని చెప్పమంటారా..?'