ETV Bharat / crime

అన్నకు రాఖీ కట్టి పంపింది.. కాసేపటికే అత్తింట్లో ప్రాణం పోయింది..!

అన్నకు రాఖీ కట్టిన కాసేపటికే అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది ఓ చెల్లెలు. ఏపీలోని విజయవాడ జిల్లా రండల్‌పేటలో ఈ విషాదం చోటుచేసుకుంది.

a-younger-sister-who-died-in-a-suspicious-condition-in-mother-in-laws-house-shortly-after-rakhi-was-tied-to-brother
అన్నకు రాఖీ కట్టి పంపింది.. కాసేపటికే అత్తింట్లో ప్రాణం పోయింది..!
author img

By

Published : Aug 23, 2021, 9:30 AM IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యువతి.. అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్లిన సోదరుడు.. తన చెల్లి చనిపోయిందన్న విషయం తెలిసుకుని నిశ్చేష్టుడయ్యాడు. తిరిగి వచ్చేసరికి మార్చురీ బాక్సులో పెట్టిన మృతదేహాన్ని చూసి బోరుమన్నాడు. అత్తింటివారే ఆమె మరణానికి కారకులని బంధువులు ఆరోపిస్తున్నారు. ఏపీలోని ప్రసాదంపాడుకు చెందిన ఉష (23) రెండేళ్ల క్రితం అరండల్‌పేటకు చెందిన ఫణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్త మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తుండగా, ఉష సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నావంటూ తన సోదరిని అత్తింటివారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసేవారని ఉష సోదరుడు సూర్యనారాయణ ఆరోపించారు.

నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో చెల్లెలి ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకుని వెళ్లానని, తర్వాత రెండు గంటల్లోనే ఉష చనిపోయిందని సమాచారం ఇచ్చారంటూ విలపించారు. ఇంట్లో కళ్లు తిరిగి పడిపోయిన ఉషను ఆసుపత్రికి తీసుకువెళ్లామని, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారని భర్త, ఇతర బంధువులు చెబుతున్నారు. యువతి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు సూర్యారావుపేట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దక్షిణ ఏసీపీ ఎన్‌.వెంకటేశ్వర్లు, సీఐ సూర్యనారాయణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

ఇదీ చదవండి: పొగాకు ఉత్పత్తులకు బానిసలవుతున్న యువతరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.