ETV Bharat / crime

బైక్​ నంబర్​ప్లేట్​పై ముసుగేసి మహిళలతో అసభ్య ప్రవర్తన.. చివరకు అలా దొరికిపోయి.. - శంషాబాద్​లో మహిళలకు వేధింపులు

women harassment : తండ్రి శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. ప్రతిరోజు తెల్లవారుజామున తండ్రిని ఎయిర్​పోర్ట్ వద్ద దింపడానికి బైక్​పై వెళ్తుంటాడు ఆ యువకుడు. ఆ సమయంలో ఎయిర్​పోర్టులో విధులు నిర్వహించడానికి వెళ్తోన్న మహిళా ఉద్యోగులపై కన్నేశాడు. తండ్రిని దింపిన తర్వాత వారి వెంటపడటం మొదలుపెట్టాడు. వారం వ్యవధిలో ఇద్దరు మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాదు వారిని బెదిరింపులకు గురి చేశాడు. అతడి ప్రవర్తనతో విసుగెత్తిన ఆ ఉద్యోగినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీకెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా ఆ యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్​కు తరలించారు.

women harassment
బైక్‌పై వెంబడిస్తూ మహిళలకు వేధింపులు
author img

By

Published : May 30, 2022, 9:43 AM IST

women harassment: మహిళా ఉద్యోగులపై కన్నేసి బైక్‌పై వెంబడిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన ఆర్జీఐఏ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా జల్లుపల్లికి చెందిన అంకె కిశోర్‌(20) కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధి కోసం శంషాబాద్‌కు వచ్చాడు. తండ్రి శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రైవేట్‌ సంస్థలో పనులు చేస్తుండగా.. కిశోర్‌ స్థానిక ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

women harassment
అంకె కిశోర్

ప్రతిరోజు తన తండ్రిని శంషాబాద్ విమానాశ్రయం వద్ద ద్విచక్రవాహనంపై దింపి వెళ్తాడు కిశోర్. ఈ క్రమంలోనే తెల్లవారుజామున విమానాశ్రయంలో విధులకు వెళ్తున్న మహిళా ఉద్యోగులపై కన్నేశాడు. తన బైక్‌ నంబర్‌ ప్లేట్‌పై ముసుగు వేసి మధురానగర్‌, బస్టాండ్‌ ప్రాంతాల్లో చక్కర్లు కొడుతూ.. మహిళా ఉద్యోగులను ముట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. వారం వ్యవధిలో ఇద్దరు మహిళా ఉద్యోగులను బెదిరించి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆర్జీఐఏ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఎస్సై సుమన్‌ కాపు కాసి ఆదివారం తెల్లవారుజామున మధురానగర్‌లో అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న కిశోర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి: విషాదం నింపిన విహారం.. కర్ణాటకలో ముగ్గురు సూర్యాపేటవాసులు మృతి

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్​.. బరిలో చిదంబరం, సూర్జేవాలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.