Knife attack on lover: హైదరాబాద్‌లో ఓ యువకునిపై యువతి కత్తితో దాడి చేయటం చర్చనీయాంశమైంది. ఇందులో ఏముంది అనుకుంటున్నారా..? అక్కడే ఉంది అసులు విషయం..! వాళ్లిద్దరు కొంత కాలంగా సహజీవనం చేస్తుండటం ఓ అంశమైతే.. యువకునిపై యువతి దాడి చేయటం మరో అంశం.
అసలు విషయమేమింటే..
హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పరిధిలో కొంత కాలంగా కృష్ణ అనే వ్యక్తి ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. అయితే.. వాళ్లిద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ.. యువతి ఒక్కసారిగా కృష్ణపై కత్తితో దాడికి దిగింది. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: