ETV Bharat / crime

ఒకే గ్రామంలో యువతి, యువకుడు ఆత్మహత్య.. ఆ వ్యవహారమే కారణమా..? - ఆత్మహత్య చేసుకున్న యువతీ యువకుడు

Young Woman and Young Man Suicide: ఒకే గ్రామంలో గంట వ్యవధిలో ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన నాగర్​కర్నూల్​ జిల్లాలో సంచలనం రేపింది. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని స్థానికులు అంటున్నారు.

Young Woman and Young Man Suicide
Young Woman and Young Man Suicide
author img

By

Published : Sep 18, 2022, 6:23 PM IST

Young Woman and Young Man Suicide: నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే గ్రామంలో యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఫ్యానుకు ఉరేసుకుని.. గంట వ్యవధిలో యువకుడు పొలం వద్ద ఓ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తాడూరు మండలం తుమ్మలసూగూర్ గ్రామానికి చెందిన గౌసియా బేగం అనే యువతి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. గౌస్‌ అనే యువకుడు గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్మకు పాల్పడ్డాడు. వీళ్లిద్దరూ వరుసకు అన్నాచెల్లెలు అవుతారని గత కొంతకాలంగా కలిసి మెలసి ఉంటున్నారని.. యువకుడి తల్లి తెలిపింది. సన్నిహితంగా ఉంటున్నందున ఎవరైనా ఏదైనా అంటారనే భయంతోనే వీళ్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే వీళ్లిద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.