ETV Bharat / crime

అద్దె ఇంట్లో  కత్తితో యువకుడి హల్​చల్

జగిత్యాల పట్టణంలో ఓ యువకుడు కత్తితో బుధవారం రాత్రి హల్‌చల్‌ చేశాడు. కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేశాడు. ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ పై అంతస్తులో చోరీ విషయంపై నిలదీయగా.. కత్తితో బెదిరిస్తూ తనవద్దకు రావొద్దని భయపెట్టాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

A young man colonists with a sword at jagtial
కాలనీవాసులను కత్తితో భయపెట్టిన యువకుడు
author img

By

Published : Jun 24, 2021, 11:43 AM IST

ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ పైఅంతస్తులో కన్నం వేసి ఓ యువకుడు దొరికిపోయాడు. దీంతో ఆ యువకుడు కత్తితో హల్‌చల్‌ చేసిన ఘటన... జగిత్యాల పట్టణంలో బుధవారం రాత్రి జరిగింది. జగిత్యాల పట్టణంలోని బీటుబజార్‌కు చెందిన బొర్రగల ప్రతాప్‌ తన భార్య పద్మతో కలిసి నివసిస్తున్నాడు. బుధవారం కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని బీరువాలో చూడగా ఆటో కొనుగోలు నిమిత్తం దాచి పెట్టిన రూ.3 లక్షలు చోరీకి గురైనట్లు గమనించాడు.

అదే ఇంట్లో కింద అద్దెకు ఉంటున్న శ్రీను అనే పాత నేరస్థునిపై అనుమానంతో స్థానికులతో కలిసి పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో శ్రీను అనే యువకుడు సుమారు గంట సేపు కత్తితో తన వద్దకు రావద్దని రహదారిపై హంగామా చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులు ఇంట్లో వెతికి రూ.2 లక్షలు పోలీసులకు అందజేయగా బాధితునికి అప్పగించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ జయేష్‌రెడ్డి విచారణ చేస్తున్నారు.

ఇదీ చూడండి: NRI HOSPITAL : మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.