ETV Bharat / crime

గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి - Sangareddy District Latest News

సంగారెడ్డి జిల్లా గాజులపాడ్ తండాలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బోల్తా పడి ఓ యువకుడు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

A young man was Died when a gram panchayat tractor overturned in Gajulapad Thandra in Sangareddy district
గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి
author img

By

Published : Feb 11, 2021, 7:19 PM IST

సంగారెడ్డి జిల్లా కంగి మండలంలోని గాజులపాడ్ తండాలో విషాదం చోటుచేసుకుంది. ఆ ఊరిలో మైసమ్మ బోనాల ఉత్సవాలకు నీరు తరిలిస్తున్న గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బోల్తా పడి ఓ యువకుడు మృతిచెందాడు. వాహన చోదకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

చోదకుడు జయరాం అజాగ్రత్తగా, అతివేగంగా వాహనం నడపడంతో రోడ్డుపై బోల్తా పడిందని కంగి ఎస్సై అబ్దుల్ రఫీక్ వెల్లడించారు. ఘటనలో డ్రైవర్​ పక్కన కూర్చున్న తండాకు చెందిన సంతోశ్ (18) ట్రాక్టర్ ఇంజన్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

చోదకుడు తీవ్ర గాయాలతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి తండ్రి గుండునాయక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అబ్దుల్ రఫీక్ తెలిపారు.

ఇదీ చూడండి: మూడు లారీలు ఢీ.. కంటైనర్​ డ్రైవర్​ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.