ETV Bharat / crime

పాతబస్తీలో యువకుడిపై కత్తులతో దాడి - Santoshnagar ACP Office Latest News

Knifes Attacked In Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో కత్తులతో యువకులు హల్​చల్ చేశారు. ఏసీపీ కార్యాలయం ఎదుటే ఓ వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. పక్కనే పోలీస్​స్టేషన్​లో ఉన్న సిబ్బంది బయటకు వచ్చి ఈ గొడవను అడ్డుకునే ప్రయత్నం చేయలేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటన నిన్న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

A young man was  attacked with knives in Hyderabad

author img

By

Published : Nov 10, 2022, 5:06 PM IST

Knifes Attacked In Hyderabad: హైదరాబాద్ సంతోష్‌నగర్​లో యువకులు రెచ్చిపోయారు. ఏసీపీ కార్యాలయం ముందే ఓ యువకుడిపై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.ఈ ఘటన నిన్న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పాతబస్తీకి చెందిన ఇమ్రాన్ ఆటో డ్రైవర్​గా పని చేస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి వసీం, అహ్మద్, సల్మాన్, ఇమ్రాన్ అనే నలుగురు వ్యక్తులు కలిసి ఇమ్రాన్​పై దాడికి పాల్పడ్డారు.

పక్కనే ఏసీపీ కార్యాలయం ఉన్న అవేమి పట్టించుకోకుండా దుండగులు ఇమ్రాన్​పై కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. స్థానికులు ఈ గొడవను ఆపేందుకు యత్నించిన వారు పట్టించుకోలేదు. ఇంత జరిగినా పక్కనే స్టేషన్​లో ఉన్న పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి దాడికి పాల్పడిన నిందితులు గంజాయికి బానిసలని స్థానికులు చెప్పారు. ఇకనైనా పోలీసులు స్పందించి పాతబస్తీలో నిఘా పెంచాలని వారు కోరుతున్నారు. వారికి మత్తు పదార్థాలు తెచ్చి ఇవ్వనందుకే తనపై దాడి చేశారని బాధితుడు ఇమ్రాన్​ పేర్కొన్నారు.

పాతబస్తీలో ఓ యువకుడిపై కత్తులతో దాడి

ఇవీ చదవండి: రుణ యాప్​ల కేసులో మరో ముగ్గురు అరెస్ట్

'మతం మారిన దళితులకు ఎస్సీ హోదా'... కేంద్రం ఏం చెప్పిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.