ETV Bharat / crime

పెళ్లి చేసుకుంటా.. ఉద్యోగం ఇప్పిస్తానని రూ.7.55 లక్షలు స్వాహా! - తెలంగాణ వార్తలు

యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు ఓ యువకుడు. అన్ని రకాలుగా స్థిరపడిన కుటుంబమని మాయమాటలు చెప్పాడు. అంతేకాకుండా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. హైదరాబాద్​లో ఓ బ్యాంక్ ఖాతా తెరవమని చెప్పాడు. కట్​చేస్తే ఖాతా తెరిచిన 20 రోజుల్లోనే రూ.7.55లక్షలు దండుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

cyber crime in Hyderabad, Hyderabad cyber crime
హైదరాబాద్ సైబర్ నేరాలు, సైబర్ నేరాలు తాజా వార్తలు
author img

By

Published : Apr 3, 2021, 8:40 AM IST

మ్యాట్రీమోని వెబ్‌సైట్‌ ద్వారా పరిచయమై, ఉద్యోగం ఇప్పిస్తానని రూ.55 వేలు దండుకోవడమే కాకుండా.. తన పేరిట ఓ కార్పొరేట్‌ బ్యాంక్‌లో ఖాతా తెరిపించి దగా చేశాడంటూ ఓ బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. నగరానికి చెందిన ఓ యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమె ప్రొఫైల్‌ను మ్యాట్రీమోనిలో పెట్టారు. సాయికల్యాణ్‌ అనే వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేశాడు. తనది గుంటూరు, ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాను. ఇక్కడో పెద్ద కంపెనీలో జీఎం హోదాలో పని చేస్తున్నానని చెప్పాడు. తల్లిదండ్రులు నాగార్జున విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు, ఉన్నత కుటుంబం అని చెబుతూనే.. మీరు బాగా నచ్చారని చెప్పాడు. మీ స్థాయికి మేము తూగలేము కాబట్టి నేనీ సంబంధం వద్దనుకుంటున్నానని యువతి కరాఖండిగా చెప్పేశారు.

మీరు పెద్ద కంపెనీలో పని చేస్తున్నారు కదా.. తనకో మంచి ఉద్యోగం ఇప్పించగలరా.. అని యువతి కోరింది. తప్పకుండా ఇప్పిస్తానని చెప్పి.. తనకు ట్రేడింగ్‌లో మంచి అనుభవం ఉందని, మీరు సరే అంటే.. మంచి లాభాలు ఇప్పిస్తానని చెప్పాడు. తరువాత బెంగళూరులో తనకు బ్యాంక్‌ ఖాతా వాడుకోవడం కొంత ఇబ్బందికరంగా ఉంది. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో మీ పేరిట ఖాతా తెరిచి ఇవ్వండని చెప్పాడు. అక్కడైతే మా కంపెనీకి సంబంధించి లావాదేవీలకు ఇబ్బంది ఉండదని చెప్పాడు. ఈమేరకు ఆమె ఖాతా తెరిచారు. డెబిట్‌ కార్డు పంపిస్తే.. బెంగళూరులోనే విత్‌డ్రా చేసుకుంటానని చెప్పడంతో డెబిట్‌ కార్డును కేఎస్‌ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఇచ్చి పంపించారు.

డబ్బు డ్రా చేస్తున్నప్పుడు వచ్చే ఓటీపీలు అతనికి చెప్పేది. మీ ఉద్యోగం కోసం ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతరత్రా ఖర్చుల కోసమని రూ.55 వేలు తన ఖాతాలో వేయించుకున్నాడు. ఆ తర్వాత ఫోన్‌ ఆపేశాడు. ఆమె ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఖాతా తెరిచిన 20 రోజుల్లోనే రూ.7 లక్షల వరకు బెంగళూరులోని నెక్స్ట్‌ లెవల్‌ కంపెనీకి బదిలీ అయ్యాయి. కార్పొరేట్‌ బ్యాంకుల్లో ఖాతా తెరిస్తే పనిచేయడానికి కనీసం 24 గంటలు పట్టాల్సి ఉండగా, కేవలం మూడు గంటల్లోనే పనిచేయడం గమనార్హం. ఈమేరకు సైబర్‌ క్రైం పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ ప్రారంభించారు.

ఇదీ చదవండి: బెంగళూరులో తీగ లాగితే.. తెలంగాణలో కదిలిన డొంక!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.