ETV Bharat / crime

Murder at Kukatpally: కూకట్​పల్లిలో పాలవ్యాపారి హత్య.. అదే కారణమా? - యువకుడి దారుణ హత్య

హైదరాబాద్​లోని కూకట్​పల్లిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో అతని స్నేహితుడే అంతమొందించాడు. ఈనెల 1న అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది.

a young man murder at Kukatpally
కూకట్​పల్లిలో యువకుడి దారుణ హత్య
author img

By

Published : Oct 7, 2021, 5:12 AM IST

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో స్నేహితుడినే హత్య చేసిన ఘటన హైదరాబాద్​లోని కూకట్​పల్లిలో జరిగింది. ఖైత్లాపూర్​లో పాలవ్యాపారం చేసుకునే శ్రీకాంత్​(26)ను అతని స్నేహితుడు శ్రీశైలం దారుణంగా చంపేశాడు.

కాల్​డేటా ఆధారంగా దర్యాప్తు

ఖైత్లాపూర్​లో నివసించే శ్రీకాంత్(26) ఈనెల 1న అదృశ్యమైనట్లు అతని కుటుంబ సభ్యులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కాల్​డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అతడు శ్రీశైలం భార్యతో ఎక్కువగా మాట్లాడటం జరిగిందని నిర్ధారించారు. అతడు చివరిసారిగా శ్రీశైలంతో కనిపించగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దర్యాప్తులో నేరాన్ని అంగీకరించినట్లు కూకట్​పల్లి సీఐ నర్సింగ్​రావు తెలిపారు.

ఈనెల 1న తేదీన ఐడీఎల్​ కంపెనీ పరిసరాల్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు శ్రీశైలం పోలీసులకు తెలిపారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా హత్య జరిగిన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు

ఇదీ చూడండి: Honey Trap: బావ.. మరదలు.. ప్రియుడు.. మధ్యలో ఓ సుబ్బు.. వలపు వలతో కోటి కాజేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.