ETV Bharat / crime

యూట్యూబ్​ చూసి నాటుబాంబుల తయారీ.. అమ్మడానికి వెళ్తుండగా.. - ఆంధ్రప్రదేశ్​ వార్తలు

యూట్యూబ్​లో చూసి నాటుబాంబులు తయారు (Bombs Making) చేశాడో యువకుడు. తయారు చేసిన బాంబులను విక్రయించడానికి వెళ్తుండగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ.. అతను ఈ నాటు ప్రయోగం ఎందుకు చేశాడో తెలుసా?

Bombs Making
నాటుబాంబుల తయారీ
author img

By

Published : Oct 28, 2021, 10:05 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా మడుగుపల్లి గ్రామంలో నాటు బాంబులు తయారు చేస్తున్న యువకుడిని పుట్లూరు పోలీసులు అరెస్టు చేశారు. తయారు చేసిన నాటుబాంబులను విక్రయించడానికి వెళుతుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు.

పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామానికి చెందిన యాపర్ల నరేష్ కుమార్ రెడ్డి(24) ఎలాగైనా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. దీనికోసం నాటుబాంబులను తయారు చేయాలనుకున్నాడు. వాటిని ఎలా తయారు చేయాలో తెలియక.. యూట్యూబ్​లో చూసి నేర్చుకున్నాడు.

నాటుబాంబుల తయారీకి కావల్సిన సామాగ్రిని సిద్ధం చేసుకున్నాడు. ఊరిబయట ఉన్న అరటి తోటలో రెండు నాటుబాంబులను తయారు చేశాడు. ఆ బాంబులను అమ్మడానికి అనంతపురం వెళుతుండగా.. మడుగుపల్లి నుంచి నార్పలకు వెళ్లే దారిలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. నరేష్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్​కి తరలించారు.

ఇదీ చదవండి: జంగంపల్లిలో నాటుబాంబు పేలి కూలిన ఇంటి పైకప్పు

విషాదం: నాటుబాంబు పేలి విద్యార్థి మృతి

Chhattisgarh: దంతెవాడలో ఐఈడీ పేలుడు- ఓ వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.