ETV Bharat / crime

పటాన్​చెరులో తూర్పుగోదావరి వాసి అదృశ్యం - Sangareddy District Latest News

స్నేహితులతో కలిసి ఉన్న ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పటాన్​చెరులో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

A young man from East Godavari district has gone missing in Patancheru
పటాన్​చెరులో తూర్పుగోదావరి వాసి అదృశ్యం
author img

By

Published : Mar 9, 2021, 10:47 AM IST

స్నేహితులతో కలిసి గదిలో ఉన్న కోటేశ్వరరావు అనే యువకుడు అదృశ్యమైన ఘటన పటాన్​చెరులో జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన సదరు వ్యక్తి సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని తోషిబా పరిశ్రమలో సూపర్​వైజర్​గా పనిచేస్తున్నాడు.

నాలుగేళ్ల క్రితం నుంచి స్నేహితులతో కలిసి పట్టణంలోని గోనెమ్మబస్తీలో ఉంటున్నాడు. మార్చి 5న గదిలో మిత్రులు లేనివేళ ఎవ్వరికీ చెప్పకుండా కోటేశ్వరరావు వెళ్లిపోయాడు. రూమ్లో​ అతను లేకపోవడంతో ఫోన్ చేశారు. చరవాణి ఆపేసి ఉండటంతో చుట్టుపక్కల వెతికినా అచూకీ లభించలేదు.

అతని స్వగ్రామంలోని కుటుంబ సభ్యులను ఫోన్ చేయగా అక్కడికీ రాలేదని చెప్పారు. పటాన్​చెరు రాణాలో వెంటనే ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: మెదక్​ జిల్లాలో పెట్రోల్‌ దాడికి గురైన మహిళ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.