Man Fell down: చరవాణిలో వీడియో గేమ్ ఆడుతూ భవనం పైనుంచి పడిన ఓ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ పంజాగుట్టలో చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరక్‌పూర్‌కు చెందిన అజయ్ (22), మేనమామ రాజేశ్‌తో కలిసి పంజాగుట్ట ప్రేమ్‌నగర్‌లో ఓ భవనం మూడో అంతస్తులో ఉంటున్నాడు. పాత సామాన్ల గోదాములో పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి తాను నివసిస్తున్న భవనంపై చరవాణిలో వీడియో గేమ్ ఆడుతూ కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని తొలుత ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. ఈమేరకు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: వికారాబాద్‌లో జిల్లాలో అకాల వర్షం.. కొట్టుకుపోయిన కూరగాయలు
ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే- తొలిసారి ఇంజినీర్‌కు సైన్యం బాధ్యతలు