ETV Bharat / crime

ప్రేమించట్లేదని యువతిపై కత్తితో దాడి.. యువకుడు మృతి - యువతిపై కత్తితో దాడి

a-young-man-attacked-a-young-woman-with-a-knife-in-jabithapur-jagtial-district
ప్రేమించట్లేదని యువతిపై కత్తితో దాడి..
author img

By

Published : May 8, 2021, 1:06 PM IST

Updated : May 9, 2021, 2:32 AM IST

13:03 May 08

ప్రేమించట్లేదని యువతిపై కత్తితో దాడి.. యువకుడు మృతి

ఎన్నిచట్టాలు తెచ్చినా... ఎన్ని షీటీమ్​లు వచ్చినా మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటివరకు ప్రేమిస్తున్నామంటూ వెంటపడతారు. అమ్మాయి వద్దనే సరికి వారిలోని మృగాన్ని మేల్కొల్పుతారు. తాజాగా జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం జాబితాపూర్‌లో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసి తాను గొంతుకోసుకున్నాడు. ఈ ఘటనలో కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. యువతి జగిత్యాలలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  

మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన కట్కం రాజ్​కుమార్..​ జాబితాపూర్​కు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాంటూ.. కొద్ది కాలంగా వెంటపడుతున్నాడు. గల్ఫ్​కు వెళ్లి నాలుగు నెలల క్రితం వచ్చిన రాజ్​కుమార్​ తరుచూ యువతికి ఫోన్​ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె స్పందించకపోవడంతో శనివారం ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. యువతి ప్రతిఘటించడంతో తన దగ్గరున్న కత్తితో యువతి మెడ వెనుక వైపు కోశాడు. అప్పటికే ఆమె కుటుంబ సభ్యులు చేరుకుని అడ్డుకోవటంతో  అతను అదే కత్తితో గొంతు కోసుకుసుకున్నాడు. 

ఇదీ చూడండి: అందమైన కాపురానికి పంచ సూత్ర ప్రణాళిక!

Last Updated : May 9, 2021, 2:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.