ETV Bharat / crime

కలెక్టరేట్ ఎదుట కిరోసిన్​తో మహిళ ఆత్మహత్యాయత్నం - nagar kurnool joint collector srinivas reddy latest news

తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ కలెక్టరేట్​ ముందు కిరోసిన్​ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లాలో జరిగింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కురుమయ్య కిరోసిన్ సీసా లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. సమస్యను పరిష్కరిస్తానని జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇవ్వటంతో మహిళ వెనుదిరిగింది.

suicide attempt, nagar kurnool district
నాగర్​ కర్నూల్​, జ్యోతి
author img

By

Published : Jul 14, 2021, 4:23 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు ఓ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బిజినేపల్లి మండలం సల్కరిపేటకు చెందిన జ్యోతి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. తన భర్త మృతి చెందటంతో భూమికోసం రెండేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతుంది. వారసత్వంగా రావాల్సిన భూమి తనకు ఇవ్వకుండా తన బావ(భర్త సోదరుడు) ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అధికారులకు మొరపెట్టుకుంది. భూమి దగ్గరికి వస్తే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని విన్నవించుకుంది.

ఎవరూ పట్టించుకోకపోవడంతో విసిగి వేసారిపోయిన మహిళ కిరోసిన్ డబ్బాతో ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకునే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కురుమయ్య కిరోసిన్ సీసా లాక్కున్నాడు. అప్పటికే కిరోసిన్ కొంత ఆమెపై పడింది. తర్వాత జాయింట్ కలెక్టర్ దగ్గరికి ఆమెను తీసుకెళ్లారు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరిస్తానని ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని నచ్చజెప్పారు.

నాగర్​ కర్నూల్​ కల్టెరేట్​ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

ఇదీ చదవండి: KTR: ఈటలకు తెరాసలో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలి: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.