అత్తింటి వారి వరకట్న వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన పావని(22) మెట్టినింటి వారి ధన దాహానికి బలైంది. భర్త, ఆడపడుచు, అత్తమామల వేధింపులు తాళలేక ఇంట్లోనే ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని తనువు చాలించింది. ఈ విషాద ఘటన మియాపూర్ ఎస్‌ఎంఆర్ మెట్రో పోలీసు పరిధిలో జరిగింది.
భర్తతో సహా వేధింపులు
మియాపూర్‌లో నివసిస్తున్న పావని (22) భర్త శ్రవణ్, అత్తమామలు శకుంతల, హిమవంత్ రెడ్డితోపాటు ఆడపడుచు సైతం తరచుగా వరకట్నం కోసం వేధిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిత్యం వారు పెట్టే చిత్రహింసలు శృతి మించడంతో భరించలేక రాత్రి సమయంలో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే దగ్గరలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాం ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన ఏసీపీ అదే విధంగా మృతురాలు ఉరివేసుకున్న ఇంటి పరిసరాలను కూడా పరీశీలించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు మియాపూర్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
విల్లా కావాలని భార్యపై ఒత్తిడి
తెల్లాపూర్‌కు చెందిన మల్లారెడ్డి కుమార్తె పావని రెడ్డికి మియాపూర్‌కు చెందిన శ్రావణ్ కుమార్ రెడ్డితో గతేడాది వివాహం జరిగింది. పావని, శ్రావణ్ కుమార్ మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ మెట్రో పొలీస్‌లో నివాసముంటున్నారు. గత కొన్ని రోజులుగా శ్రావణ్ కుమార్ తెల్లాపూర్‌లో విల్లా కావాలని భార్యపై ఒత్తిడి తేవడంతో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అదే విషయమై శ్రావణ్ శనివారం సాయంత్రం భార్యతో గొడవపడి.. ఆమెను వారి కుటుంబ సభ్యులతో మాట్లాడవద్దని చెప్పి బయటకు వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన పావని ఇంట్లో ఫ్యాన్‌కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి మల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .
ఇదీ చూడండి: కొడుకును నీట్ పరీక్ష రాయమని చెప్పి... తండ్రి ఆత్మహత్య