ETV Bharat / crime

women suicide in Godavarikhani : ఆస్పత్రిలో ఉరేసుకుని బాలింత ఆత్మహత్య - పెద్దపల్లి జిల్లా వార్తలు

women suicide
women suicide
author img

By

Published : Dec 26, 2021, 8:44 AM IST

Updated : Dec 26, 2021, 10:21 AM IST

08:39 December 26

ఆస్పత్రిలో ఉరేసుకుని బాలింత ఆత్మహత్య

ఆస్పత్రిలో ఉరేసుకుని బాలింత ఆత్మహత్య

women suicide in Godavarikhani : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం జరిగింది. ప్రభుత్వాస్పత్రిలో ఓ బాలింత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 15 రోజుల క్రితం బాబుకు జన్మనిచ్చిన మహిళ.. ఇవాళ ఆస్పత్రిలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కమాన్‌పూర్ మండలం రొంపికుంటకు చెందిన గుమ్మడి ఉమ.. 15 రోజుల క్రితం ప్రభుత్వాస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. వారం రోజులకు డిశ్చార్జ్‌ చేయాల్సి ఉండగా.. శస్త్ర చికిత్స సమయంలో వేసిన కుట్లు మానలేదు. ఈ క్రమంలో మళ్లీ 3 సార్లు ఉమకు కుట్లు వేయటంతో భరించలేని నొప్పులతో ఉమ తల్లడిల్లినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. బాధ తట్టుకోలేకే ఆస్పత్రి బాత్‌రూంలో చీరతో ఉరేసుకుని.. బలవన్మరణానికి పాల్పడినట్లు వాపోయారు.

ఉమ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ.. ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాధితులకు న్యాయం చేసి.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: Mother, son Suicide: రెండేళ్ల కుమారుడితో సహా తల్లి ఆత్మహత్య

Last Updated : Dec 26, 2021, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.