Push The Youth Into Prostitution: తమ అర్ధనగ్న చిత్రాలను సేకరించి.. వ్యభిచార కూపంలోకి నెట్టాలని ఓ మహిళ ప్రయత్నిస్తోందని.. ఇద్దరు యువతలు నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఆ మహిళ పలువురు యువతులను ఏమార్చి వ్యభిచారంలోకి దించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని ఏపీ విజయవాడ సీపీ కాంతిరాణా టాటా పోలీసులను ఆదేశించారు.
టాస్క్‌ఫోర్సు పోలీసులతో.. ఒక బృందాన్ని దర్యాప్తునకు నియమించినట్లు తెలిసింది. ఇటీవల కాలంలో యువతులను ఏమార్చే ముఠాలు నగరంలో తిరుగుతున్నాయని దర్యాప్తు బృందం కనుగొన్నారు. అయితే ఈ సంఘటన వెలుగులోకి రావడంతో నగరంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల వివరాలు ప్రకారం ప్రత్యర్థి.. .యువతులను ఏ విధంగా వ్యభిచారంలోకి లాగుతుందో తెలిపారు.
ఓ మహిళ కొంత కాలంగా పటమటలో.. ఒక వస్త్రదుకాణం నిర్వహిస్తోంది. తన దుకాణానికి వచ్చిన యువతులను తన ఆకర్షణీయ మాటలతో స్నేహం పెంచుకుంటుంది. ఈ పరిచయాలతో వారిని కిట్టిపార్టీలకు ఆహ్వానించి.. పార్టీలో శీతల పానీయాల్లో మద్యం కలిపి సేవించేలా ఏర్పాట్లు చేస్తుంది. కొంత మందికి నేరుగా మద్యం అలవాటు చేస్తుంది. ఇలా అలవాటు అయిన వారి మద్యం తాగే చిత్రాలు, వస్త్రాలు మార్చుకునే సమయంలో నగ్న చిత్రాలు రహస్యంగా సేకరించేది.
తరువాత వారిని ముందుగా డబ్బు ఆశ చూపించేది.. దానికి లొంగని వారిని రహస్యంగా సేకరించిన నగ్న చిత్రాలు చూపించి.. బెదిరించి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తుండేది.. బాధితుల చిత్రాలను.. విటులకు చూపించి బేరాలు కుదుర్చుకుంటుంది. హైప్రొఫైల్ వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని వ్యభిచార కూపంలోకి నెట్టే ప్రయత్నం చేసేది. ఇలా ఇటీవల ఓ యువకుడికి తన వద్ద ఉన్న ఓ యువతి చిత్రాలను చూపించి రూ.లక్షకు బేరం కుదుర్చుకుంది. దీనికి మరో మధ్యవర్తి ఉన్నట్లు తెలిసింది. తర్వాత ఆ యువతిని పంపించడంలో ..జాప్యం జరగడం.. యువకుడు ఒత్తిడి చేయడంతో.. ఆ మహిళ, యువతిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించింది.
దీనికి తట్టుకోలేని ఆ యువతి మరో బాధిత యువతితో కలిసి నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. తమ పరువుకు భంగం కలుగకుండా చర్యలు తీసుకోవాలని.. ఆ మహిళ పూర్తి చరిత్రను పోలీసులకు తెలియజేశారు. ఈ వ్యవహారాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సీపీ అప్పగించారు. దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఇదే మహిళపై పటమట పోలీసు స్టేషన్‌కు ఇటీవల ఒక ఫిర్యాదు వచ్చింది. తనకున్న పలుకుబడితో దాన్ని మాయం చేసినట్లు తెలిసింది.
ఈ మహిళకు ఓ స్పా నిర్వాహకుడికి మధ్య ఘర్షణ జరిగింది. స్పాకు యువతులను పంపడంలో లావాదేవీల గురించి ఈ ఘర్షణ జరిగింది. బహిరంగంగా పటమట మీసేవా వద్ద ఇద్దరూ బాహా బాహీ తలపడ్డారు. ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఆ యువకుడికి, పోలీసులకు ఉన్న సాన్నిహిత్యంతో.. కేసు నమోదు కాకుండా మాయం చేశారని తెలిసింది.
ఇవీ చదవండి: