ETV Bharat / crime

Car Rash driving: మద్యం మత్తులో మహిళ డ్రైవింగ్​.. తరువాత ఏమైందంటే.. - మద్యం మత్తులో పలువురిని ఢీ కొట్టిన యువతి

Car Rash driving by woman in Shamshabad: ఓ యువతి అతివేగం, నిర్లక్ష్యం ముగ్గురిని తీవ్రగాయాలకు గురిచేసింది. లగ్జరీ విలువ చేసే కారులో రాష్​ డ్రైవింగ్​ చేస్తూ రోడ్డుపై ఉన్న వారిని హడలెత్తించింది. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి కారణం కావడమే కాకుండా.. ఇదేంటని ప్రశ్నించిన వారితోనే వాగ్వాదానికి దిగింది. ఇక కారులో ఖరీదైన మద్యం బాటిళ్లు దొరకడం కొసమెరుపు. శంషాబాద్​లో ఈ ఘటన చోటుచేసుకుంది.

car rash driving in sahamshabad
శంషాబాద్​లో కారు బీభత్సం
author img

By

Published : Jan 27, 2022, 4:10 PM IST

Car Rash driving by woman in Shamshabad: అవసరానికి మించిన సంపాదన.. చేతి నిండా డబ్బులు.. బయటకు అడుగుపెడితే బెంజి కారు. ఇంకేముంది సరదాలకు కొదవ లేదు. ఎవరినీ లెక్క చేయరు. డబ్బున్న బాధ్యతలేని యువత తీరిది. ఇలా పట్టపగలే మితిమీరిన వేగంలో మద్యం సేవించి కారేసుకొని రోడ్లపై పడింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి రహదారిపై వెళ్తున్న వారిని ఢీ కొట్టింది. యువతి డ్రైవింగ్​కు రోడ్డుపై ఉన్న వారు బెంబేలెత్తిపోయారు. ఆమె వైఖరితో ముగ్గురు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదేంటని స్థానికులు అడ్డుకుని ప్రశ్నిస్తే వారితోనే వాగ్వాదానికి దిగింది.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో వద్ద ఈ ఘటన జరిగింది. ఓ యువతి మద్యం మత్తులో కారు నడిపి రోడ్డుపై వెళ్తున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారును స్థానికులు అడ్డుకోవడంతో... వారితో యువతి, కారులో ఉన్న మరో వ్యక్తి వాగ్వాదానికి దిగారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనంలో ఖరీదైన మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఉన్న యువతి సహా ఆమెతో ఉన్న వ్యక్తిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: 'సొంత నియోజకవర్గంలోనే పోలీసులు కనీస భద్రత కల్పించలేదు..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.