సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కోమరబండకు చెందిన జానకమ్మ(50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తాగుడుకు బానిసైన ఆమె కుమారుడు జగదీశ్ చారికి, తల్లికి కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని గ్రామస్థులు చెప్పారు. నిత్యం మద్యం సేవించి తల్లితో గొడవకు దిగేవాడని తెలిపారు. శుక్రవారం సాయంత్రం తల్లి ఆరోగ్యం బాగాలేదని అతను ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
అయితే తాగిన మైకంలో కన్నతల్లిని హత్య చేసి ఉంటాడా అనే అనుమానం వ్యక్తం చేస్తూ శనివారం ఉదయం డయల్ 100కు గ్రామస్థులు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని జగదీశ్ చారిని అదుపులోకి తీసుకొన్నారు. విచారణ నిమిత్తం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి: అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టించిన గ్రామస్థులు