దంపతుల మధ్య మొదలైన మాటల యుద్ధం ప్రాణం తీసుకునేంతవరకు వెళ్లింది. మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో గొడ్డలికి బలయ్యాడు భర్త. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కొర్లకుంటలో జరిగింది.
గ్రామంలోని శ్రీపాద కాలనీలో నలుబోతుల కిష్టయ్య దంపతులు ఉంటున్నారు. బుధవారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. తెల్లారేసరికి కిష్టయ్య రక్తపు మడుగులో పడిఉన్నాడు. గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తనపై దాడి చేయడానికికొచ్చిన భర్తతో పెనుగులాడుతుండగా గొడ్డలిపై పడి మృతి చెందాడని భార్య తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: విద్యుదాఘాతంతో యువకుడు మృతి