తాళికట్టిన వాడు తాగుడుగు బానిసై చిత్రహింసలు పెడుతుంటే.. ఓపిక నశించిన ఆమె కర్రతో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరుకు చెందిన ముప్ప సాని పుల్లయ్య, సుజాతకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమార్తె ఉంది. పుల్లయ్య రోజు మద్యం తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో గురువారం పూటుగా మద్యం తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. క్షణికావేశంలో ఆమె భర్త తలపై కర్రతో కొట్టింది. తీవ్రంగా గాయపడిన పుల్లయ్యను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇదీ చూడండి: ఆర్మీ జవాన్ మృతి.. వెల్లడి కాని కారణాలు