ETV Bharat / crime

లైవ్​ వీడియో: బైక్​పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్​ - మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు

మద్యం మత్తు.. ఓ వ్యక్తిని తీవ్ర గాయల పాలు చేసింది. వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్.. బైక్​ను ఢీకొట్టిన ఘటన మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్​లో జరిగింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.

tractor collided the bike
బైక్​పై దూసుకెళ్లిన ట్రాక్టర్​
author img

By

Published : May 25, 2021, 4:46 PM IST

Updated : May 25, 2021, 6:09 PM IST

రాంగ్​ రూట్​లో.. వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ బైక్​ను ఢీకొట్టి దూసుకెళ్లింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్​లో చోటు చేసుకుంది.

ఘటనా సమయంలో అటుగా వెళ్తోన్న మరో వాహనదారుడు.. ట్రాక్టర్​ను ఓవర్ టేక్​ చేసి అడ్డుకున్నాడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. డ్రైవర్​ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు.. నిందితుడికి, బాధితుడికి డ్రైవింగ్ లైసెన్స్ లేనట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

బైక్​పై దూసుకెళ్లిన ట్రాక్టర్​

ఇదీ చదవండి: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం.. దట్టంగా మంటలు

Last Updated : May 25, 2021, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.