ETV Bharat / crime

LUXURY CARS THIEF: మీరు 'కిక్'​ సినిమా చూశారా..? ఈ స్టోరీ అంతకుమించి..!

author img

By

Published : Aug 31, 2021, 6:46 PM IST

ఓ సినిమాలో హీరో క్యాన్సర్​తో బాధపడుతోన్న ఓ అనాథ చిన్నారికి సొంత డబ్బులతో ఆపరేషన్​ చేయిస్తాడు. అప్పుడు ఆ చిన్నారి ముఖంలో చిరునవ్వు చూసి.. అలాంటి వ్యాధితో బాధపడే చిన్నారులందరికీ చికిత్స చేయించాలనుకుంటాడు. అందుకోసం దొంగగా మారతాడు. పోలీసులకు చెప్పిమరీ.. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఇళ్లల్లో చోరీలు చేస్తాడు. వారి కళ్ల ముందే తెలివిగా తప్పించుకుంటాడు. హైదరాబాద్​లో ఓ అంతర్రాష్ట్ర దొంగ కథ వింటే.. అచ్చం ఆ సినిమాలాగే ఉంటుంది. కాకపోతే సినిమాలో హీరో డబ్బులు దొంగిలిస్తే.. ఇక్కడ ఈ విలన్​ మాత్రం లగ్జరీ కార్లను దొంగిలిస్తున్నాడు. పోలీసులకే ఫోన్​ చేసి నన్ను పట్టుకునే దమ్ముందా అంటూ సవాల్​ విసురుతున్నాడు.

LUXURY CARS THIEF: మీరు 'కిక్'​ సినిమా చూశారా..? ఈ స్టోరీ అంతకుమించి..!
LUXURY CARS THIEF: మీరు 'కిక్'​ సినిమా చూశారా..? ఈ స్టోరీ అంతకుమించి..!

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఓ కార్ల దొంగకు వరంగా మారింది. ఓ అంతర్రాష్ట్ర దొంగ.. ఖరీదైన కార్లను దొంగిలిస్తూ నగర పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. దమ్ముంటే తనను పట్టుకోవాలని ఏకంగా పోలీసులకే ఫోన్​ చేసి సవాల్​ విసిరాడు. పట్టుకోవడం మీ తరం అవుతుందా అని మీసం మెలేశాడు. పోలీసులకు చెప్పి మరీ దొంగతనాలు చేయటం.. సినీ ఫక్కీలో తప్పించుకుంటుండటంతో ఈ కేసు పోలీసులకు ఓ సవాల్​గా మారింది.

ఇదీ కథ..

హైదరాబాద్​ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్ 2లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో జనవరి 26న రాత్రి కన్నడ సినీ నిర్మాత వి.మంజునాథ్‌కు చెందిన (కేఏ 04 ఎంఎక్స్‌ 1000) ఫార్చునర్ కారు అపహరణకు గురైంది. మంజునాథ్ ఇచ్చిన ఫిర్యాదుతో దొంగను పట్టుకోవడానికి స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు.

నగరంలో ఖరీదైన కార్లను దొంగిలిస్తున్న వ్యక్తిపై నిఘా ఉంచారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నగరంలో కార్లను దొంగిలిస్తున్నది రాజస్థాన్​లోని జైపూర్‌కు చెందిన అంతర్రాష్ట్ర కార్ల దొంగ సత్యేంద్రసింగ్ షెకావత్​గా గుర్తించారు. ఇతడిని గతంలో దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపగా.. బెయిల్​పై విడుదల అయినట్లు తెలుసుకున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక సత్యేంద్రసింగ్ షెకావత్ కన్ను.. ఈసారి హైదరాబాద్ నగరంపై పడినట్లు గుర్తించారు.

'నేను ఇక్కడే ఉన్నాను. పట్టుకునే దమ్ముందా'..

ఈ క్రమంలోనే 'పార్క్ హయత్' కారు సత్యేంద్ర షెకావత్ అపహరించాడని నిర్ధారించుకుని అతడిని పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందం రాజస్థాన్​లోని జైపూర్‌కు వెళ్లింది. పోలీసుల రాకను పసిగట్టిన సత్యేంద్రసింగ్ షెకావత్.. పోలీసులకు వాట్సప్​ కాల్​ చేశాడు. 'నేను ఇక్కడే ఉన్నాను. నన్ను పట్టుకునే దమ్ముందా.. పట్టుకోండి చూద్దాం..' అని సవాల్​ విసిరాడు. మీరు వాడుతున్న టెక్నాలజీ చాలా పాతది.. అప్​డేట్​ అవ్వండి అని సలహా ఇచ్చి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

మరో ఝలక్​..

పోలీసులు వారం రోజుల పాటు అక్కడే ఉండి సత్యేంద్ర సింగ్​ను పట్టుకోవాలనుకున్నా.. వాళ్ల వల్ల కాకపోవడంతో తిరిగి వచ్చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతో కలిసి ప్రయత్నిస్తుండగానే.. మళ్లీ మే నెలలో నాచారం పోలీస్​స్టేషన్​ పరిధిలో ఒకటి, ఆగస్టు 5న దుండిగల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని బౌరంపేటలో మరోటి ఇలా రెండు కార్లను చోరీ చేసి పోలీసులు ఉలిక్కి పడేలా చేశాడు.

ప్రయత్నాలకు బ్రేక్..

నాచారం పరిధిలో వాహనాన్ని తస్కరించిన షెకావత్ కోసం నాచారం పోలీసులు ఇటీవల జైపూర్ వెళ్లారు. భర్తకు సహకరిస్తున్న షెకావత్ భార్యను అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఆమెకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నగర పోలీసుల ప్రయత్నాలకు బ్రేక్ పడింది.

100కు పైగా కార్ల దొంగతనం..

షెకావత్ ఇప్పటి దాకా దేశంలోని పలు నగరాల్లో వందకు పైగా కార్లను తస్కరించినట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. తస్కరించిన కార్లను డ్రగ్ డీలర్లు, ఉమెన్ ట్రాఫికింగ్ కోసం పని చేస్తున్న వారికి అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు.

సవాల్​గా మారిన కేసు..

దొంగిలించిన కార్లను షెకావత్​ స్వయంగా నడుపుకొంటూ వెళ్లి.. గుర్తు తెలియని ప్రాంతంలో కొన్నాళ్లు ఉంచిన తర్వాత తాపీగా అమ్ముతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పలు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసురుతోన్న షెకావత్​తో పాటు అతని భార్యను పట్టుకోవడం ఇప్పుడు హైదరాబాద్‌ పోలీసులకు ఓ సవాల్​గా మారింది.

ఇదీ చూడండి: women cheating: పెళ్లైన మూడు రోజులకే గర్భవతి... వరుస పెళ్లిళ్లతో ముగ్గురికి వలపుటోపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.