ETV Bharat / crime

టమాట కూర తెచ్చిన తంటా.. భార్య మాటలు విని కన్నతల్లిపై కర్కశం - Telangana Crime News

Son Attacked Mother With Knife : పెళ్లి అయితే పెళ్లాం బెల్లం అవుతుంది.. అమ్మ అల్లం అవుతుంది అనే సామెత వినే ఉంటాం కదా. ఈ ఘటనను చూస్తే అది నిజమే అనిపించక మానదు. కూర సరిగా వండనందుకు తన భార్యను మందలించిందని ఓ సుపుత్రుడు ఏకంగా కన్నతల్లిపైనే కత్తితో దాడి చేశాడు. టమాటా కూరేంటీ.. సరిగా వండలేదని కోడల్ని అత్త మందలించడమేంటీ.. ఆ కోడలు విషయాన్ని భర్తకు చెప్పడమేంటీ.. అతడు ఏకంగా తల్లిపైనే దాడి చేయడమేంటి సామీ అనుకుంటున్నారా.. అయితే ఇది చదివేయండి.

young man attacked his mother
young man attacked his mother
author img

By

Published : Jan 14, 2023, 9:26 PM IST

Son Attacked Mother With Knife : ఒక ఇంట్లో టమాట కూర తీసుకొచ్చిన తంటా.. అమ్మపై కుమారుడు దాడి చేసేలా చేసింది. చివరకు పోలీసులను ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి తెచ్చింది. ఒక టమాట కూరకే ఇంత జరిగిందా అనుకుంటున్నారా.. నిజంగా జరిగిందండి. చెప్పుకోవడానికి, వినడానకి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన మహబూబాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా వేంనూర్‌లో బుజ్జి అనే మహిళ తన కుమారుడు మహేందర్‌, కోడలు నందినితో కలిసి నివాసం ఉంటోంది. కూర వండమని అత్త కోడలుకి చెప్పగా ఆమె టమాట కూర వండింది. అది కాస్తా బాగోలేకపోవడంతో కోడలిని అత్త బుజ్జి మందలించింది.

దీంతో ఇరువురి మధ్య కొంత ఘర్షణ మొదలై చిలికి చిలికి గాలివానలా మారింది. విషయాన్ని కోడలు తన భర్త మహేందర్​కు చెప్పగా.. ఆగ్రహానికి గురైన అతడు 'నా భార్యనే మందలిస్తావా' అంటూ తల్లిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన బుజ్జిని ఇరుగుపొరుగు వారు గమనించి మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఆమెకు వైద్యులు వైద్యం అందించి తలపై కుట్లు వేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టమోట కూరతో వచ్చిన తంటా.. భార్య మాటలు విని అమ్మపై కత్తితో దాడి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.