గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం పరిధిలో జరిగింది.
రత్నంపేటకు చెందిన రాజయ్య మానేరు ప్రాజెక్టు వంతెనపై నుంచి.. వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో చాలా సమయం రాజయ్య రోడ్డుపై పడి ఉన్నా ఎవరూ ముందుకు రాలేదు. అటుగా వెళ్తున్న సిరిసిల్ల పట్టణ న్యాయవాది ఏళ్లే జ్యోతి స్పందించారు. 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి సిరిసిల్ల ఆస్పత్రిలో చేర్పించారు.
ఇదీ చదవండి: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం.. వ్యక్తి అరెస్ట్