ETV Bharat / crime

ఆ ఖైదీకి జైలు గోడలు... పిట్టగోడలతో సమానం.. ఇప్పటికే రెండు సార్లు ఎస్కేప్​.. - కర్నూలు జిల్లా కారాగారం నుంచి నిందితుడు పరారు

Prisoner Escaped: ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి జైలు నుంచి మళ్లీ పరారయ్యాడు. అంటే.. అతడు ఇలా పారిపోవడం ఇది రెండోసారి అన్నమాట..! మొదటిసారి తప్పించుకున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారు. మళ్లీ తప్పించుకోవటంతో.. పోలీసులు అతడిని వెతికే పనిలో పడ్డారు. అంత సులువుగా ఆ ఖైదీ ఎందుకు పారిపోగల్గుతున్నాడంటే..

a-prisoner-escaped-from-kurnool-district-jail

author img

By

Published : Mar 17, 2022, 6:19 PM IST

Prisoner Escaped: ఏపీలోని కర్నూలు జిల్లా కారాగారం నుంచి నిందితుడు చెంచు కుళాయి అలియాస్ నాని వారం రోజుల్లోనే రెండోసారి తప్పించుకున్నాడు. హత్యాయత్నం కేసులో గత నెల 16 నుంచి జైలులో ఖైదీగా ఉన్న నాని.. వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు కారాగారం నుంచి తప్పించుకున్నాడు. గత శుక్రవారం(మార్చి 11) రోజున నాని.. ఇదే జైలు గోడ దూకి తప్పించుకున్నాడు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వలో ఉన్న అతడి అక్క ఇంటికి వెళ్లగా.. జైలు సిబ్బంది పట్టుకున్నారు.

దీంతో నిందితుడిపై తాలూకా అర్బన్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి జైలు సిబ్బంది అతడిని ప్రత్యేక బారక్​లో ఉంచారు. ఈరోజు ఉదయం బాత్​రూంకి వెళ్తానని చెప్పి మరోసారి గోడ దూకి తప్పించుకుని పారిపోయాడు. రెండోసారి కూడా తప్పించుకోవటంతో.. అతడిని పట్టుకునే పనిలో జైలు సిబ్బంది నిమగ్నమయ్యారు.

కర్నూలు జిల్లా మహనంది మండలం అబ్బీ పురం గ్రామానికి చెందిన నల్లబోతుల కుళ్లాయికి ఇరవై ఏళ్లు ఉంటాయి. ఇంకా వివాహం కాలేదు. కుళ్లాయికి చెట్లు ఎక్కే అలవాటు ఉన్నందున జైలులో గోడలు దూకడం సులభం కావడంతో జైలు సిబ్బంది కళ్లు కప్పి గోడదూకి పారిపోతున్నాడు. వారం రోజుల వ్యవధిలో ఒక ముద్దాయి రెండు సార్లు తప్పించుకొనిపోవడంతో ఉన్నతాధికారులు జైలు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.