యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దయ్యంబండలో ఎనిమిది నెలల గర్భిణీ అయిన వాకుడోతు సబిత(22) అనుమానాస్పదంగా మృతి చెందింది. అత్తింటి వారే తమ కుమార్తెను చంపి ఉరి వేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
సబిత మరణించిన సమయం నుంచి అత్త, మామ, భర్త అక్కడ లేకపోవటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: దా'రుణ' యాప్ కేసులో రూ.76 కోట్ల ఆస్తులు సీజ్