వేగంగా వచ్చిన పెట్రల్ ట్యాంకర్.. ఎదురుగా వస్తున్న బైక్ను ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో జరిగింది.
గోలేటికి చెందిన సింగరేణి కార్మికులు..అమర్ సింగ్, నందు విధులు నిర్వహించుకుని బైక్పై ఇంటికి వెళ్తున్నారు. రహదారిపై ఎదురుగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్.. వీరి బైక్ను ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అమర్ సింగ్ ప్రాణాలు విడువగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. నందు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ.. బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండి: 'సైబర్' వలేస్తే.. ఖాతాదారు కత్తిరిస్తే..