ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండి ఆక్సిజన్, పల్స్ స్థాయిని చెక్ చేసుకునేందుకు హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆక్సీమీటర్‌ను బుక్ చేసుకున్నాడు. తీరా డెలివరీ వచ్చాక చూస్తే అందులో రాయి కనిపించడంతో అవాక్కయ్యాడు.
మియాపూర్‌లో నివాసముండే శశిధర్ శాస్త్రి ఈ నెల 7న అమెజాన్‌లో ఆక్సీమీటర్ బుక్ చేశారు. దానికయ్యే ఖర్చును, పార్శిల్ డెలివరీ ఛార్జీలను ఆన్లైన్లోనే చెల్లించారు. గురువారం పార్శిల్ అందింది. తెరిచి చూస్తే అందులో రాయి ఉండడంతో అతను ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఇంత పెద్ద సంస్థ నుంచి పార్శిల్లో రాయి రావడం బాధ కలిగించిందని శశిధర్ అన్నారు. ప్రజల ఆదరాభిమానాలు పొందిన సంస్థలో ఎక్కడ లోపం జరిగిందో సరి చూసుకొని.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మీడియా ద్వారా సంస్థను కోరారు.
ఇదీ చూడండి: తెలంగాణ వాహనాలను రానివ్వమంటూ ఆందోళన