Mother Suicide With Sons in Boinapalli: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మండల కేంద్రంలో ఐదు లక్షల రూపాయల రుణం తల్లి, ఇద్దరు కుమారుల బలవన్మరణానికి దారితీసింది. పోతర్ల అనూష, మహేందర్ ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి కుమారులు గణేశ్, మణి ఉన్నారు. కుటుంబ అవసరాల కోసం పోతర్ల అనూష ఐదు లక్షల రూపాయల రుణం తీసుకుంది. ఎనిమిది నెలల క్రితం భర్త మహేందర్ గల్ఫ్ దేశానికి వలస వెళ్లాడు. దీనితో తన పిల్లలతో బోయినపల్లిలో నివాసముంటున్న పోతర్ల అనూషపై ఐదు లక్షల రూపాయల రుణభారం పడింది.
ఇదీ చదవండి : వలపు వలలో చిక్కి దేశ సమాచారం లీక్.. వాయుసేన అధికారి అరెస్ట్!
భర్త, అత్త మామలు రుణం తీర్చాలని వేధించడంతో పోతర్ల అనూష మనస్తాపానికి గురైంది. తన ఇద్దరు కుమారులను తీసుకుని వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ కలహాల కారణంగా పసిపిల్లలతో సహా తనువు చాలించిన ఉదంతం విషాదకరంగా మారింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి : యూట్యూబ్లో ఆ వీడియో చూశాడు.. వ్యాపారి నుంచి రూ. 45 లక్షలు కొల్లగొట్టాడు