పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. రాజధాని రైలుకు ఎదురుగా నిలబడి ఒడిశాకు చెందిన ఓ కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ నుంచి రైలులో రామగుండం రైల్వేస్టేషన్ చేరుకున్న వలస కూలీ.. అందరు చూస్తుండగా ఒక్కసారిగా రైలుకు ఎదురుగా నిలబడ్డాడు. దీంతో రాజధాని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే మృతుడి మానసిక స్థితి బాగా లేదని అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: