ETV Bharat / crime

యువతి ఫోన్‌ నంబరు ఇవ్వలేదని.. తుపాకీతో యువకుడి వీరంగం! - చిత్తూరు జిల్లాలో తుపాకీతే బెదిరించిన యువకుడు

ఫోన్‌ నంబరు ఇవ్వనందుకు యువతిని బెదిరించాలని ఓ యువకుడు తుపాకీ పేల్చి వీరంగం సృష్టించాడు. ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనతో.. బాధితులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

threatening, threatening with gun, threatening with gun in ap
తుపాకితో బెదిరింపు, ఏపీలో తుపాకితో బెదిరింపులు, చిత్తూరులో తుపాకితో బెదిరింపులు
author img

By

Published : Jun 19, 2021, 9:53 AM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె పోలీసు స్టేషన్‌ పరిధిలో కడపనత్తం గ్రామానికి చెందిన చాను అనే యువకుడు గురువారం ఉదయం.. పక్కింటి యువతిని ఫోన్‌ నంబరు అడిగాడు. ఆమె నిరాకరించి ఈ విషయాన్ని కుటుంబీకులకు చెప్పింది. వెంటనే ఆమె తల్లి.. చాను ఇంటి వద్దకు వెళ్లి అతణ్ని హెచ్చరించింది. యువకుడి ప్రవర్తన సక్రమంగా లేదని గ్రామ పెద్దలకు తెలిపింది.

ఆ కుటుంబంపై కక్షగట్టిన చాను.. గురువారం రాత్రి నాటు తుపాకీతో వీధిలోకి వచ్చి వీరంగం సృష్టించాడు. ఫోన్​ నంబర్​ ఇవ్వకపోతే చంపేస్తానంటూ తుపాకీతో బెదిరించాడు. అతని అరుపులతో పొరుగింటి వారు వచ్చి ప్రశ్నించగా గన్​ పేల్చాడు. ఆ తూటా పక్కింటి తలుపును పాక్షికంగా ధ్వంసం చేసింది. భయాందోళనకు గురైన యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.