భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్‌కు చెందిన బానోత్ వీరభద్రం(41) బుధవారం రాత్రి తన ద్విచక్రవాహనంపై వెంకట్యాతండాకు వెళ్తుండగా.. తండా సమీపంలో బైక్... రహదారి నుంచి కిందకు దూసుకుపోయింది. ప్రమాదంలో వీరభద్రం మృతి చెందాడు. ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
టేకులపల్లి సీఐ రాజు, ఎస్సై రాజ్‌కుమార్ ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. ముఖం మీద తీవ్రగాయాలతో రోడ్డు పక్కన మరణించి ఉండడంపై... ప్రమాదం కారణంగా మరణించాడా లేక మరేదైనా కారణమా అన్న విషయం తేలాల్సి ఉంది.
ఇదీ చూడండి: రైలు ఢీకొని దినసరి కూలీ మృతి