ETV Bharat / crime

SUICIDE ATTEMPT: అభివృద్ధి చేసి.. అప్పుల పాలై..! - warangal urban district latest news

సర్పంచ్​గా గెలిచాడు. ఆరోగ్యం సహకరించక గ్రామ అభివృద్ధి పనులను తన బంధువుకు అప్పగించాడు. ఊరి మంచి కోసమే కదా అని ఆ బంధువూ సరే అన్నాడు. ప్రభుత్వం నుంచి వచ్చిన పనులను పోగొట్టుకోవడం ఎందుకని అప్పులు చేసి మరీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాడు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, సీసీ రోడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాడు. తీరా చేసిన పనులకు బిల్లులు రాక ఎమ్మెల్యే సభలోనే ఆత్మహత్యకు యత్నించాడు.

అభివృద్ధి చేసి.. అప్పుల పాలై..!
అభివృద్ధి చేసి.. అప్పుల పాలై..!
author img

By

Published : Jun 18, 2021, 8:14 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​ బాబు సభలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. అక్కడే ఉన్న పోలీస్​ సిబ్బంది గమనించి అతడిని నిలువరించారు.

ఏం జరిగిందంటే..

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం గుంటూర్​పల్లి గ్రామ సర్పంచ్ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో వైద్యులు ఆయన కాలు తీసేశారు. అప్పటి నుంచి గ్రామ అభివృద్ధికి సంబంధించిన పనులను తన బంధువు హనుమంతరావుతో చేయిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు హనుమంతరావు గ్రామంలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, సీసీ రోడ్లు, ఇంకుడు గుంతల పనులు చేపట్టాడు. ఒక ఎకరం పొలం అమ్మి ఆ పనులను పూర్తి చేశాడు. తీరా బిల్లులు రాకపోవడంతో విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాడు. ఎమ్మెల్యే సరిగా స్పందించకపోవడంతో.. మనస్తాపం చెందిన హనుమంతరావు ఆయన సభలో ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకుని స్టేషన్​కు తరలించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, సీసీ రోడ్లు, ఇంకుడు గుంతల పనులు చేపట్టా. బిల్లులు చెల్లించేందుకు అధికారులు లంచాలు అడుగుతున్నారు. మా సర్పంచ్​ పరిస్థితిని ఎన్నిసార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఆయన సరిగా స్పందించలేదు. ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోసం చేసిన బిల్లులు రాక.. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయి. ఇప్పటికైనా అధికారులు నా బిల్లులు చెల్లించాలని కోరుతున్నా.-హనుమంతరావు,బాధితుడు

అభివృద్ధి చేసి.. అప్పుల పాలై..!

ఇదీ చూడండి: ERRABELLI: 'రైతులను ఇబ్బందిపెడితే చర్యలు తప్పవు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.