ETV Bharat / crime

VIRAL VIDEO: 'చిన్న తగాదాలు జరిగి పీఎస్‌కు వెళ్లాం.. ఎస్‌ఐ నన్నుకొట్టి..'

పోలీసుల తీరుతో మనస్తాపం చెందిన పృథ్వీరాజ్​ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఆంధ్రప్రదేశ్​లోని​ శ్రీకాకుళం దిశ పోలీసు స్టేషన్ ఎదుట పెట్రోలు తాగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

Suicide
Suicide
author img

By

Published : Jul 28, 2021, 6:44 AM IST

భార్యను తనకు కాకుండా చేస్తున్నారని, అందుకు పోలీసులే కారణమని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్‌ ఎదుటే బి.పృథ్వీరాజ్‌ అనే యువకుడు పెట్రోలు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని మహిళా పీఎస్‌ ఎదుట మంగళవారం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆతడిని ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అంతకముందు అతను విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. వీడియో వైరల్​

‘నా కుటుంబంలో చిన్న తగాదాలు జరిగి మహిళా పీఎస్‌కు వెళ్లాం. పోలీసులు కౌన్సెలింగ్‌ చేయకుండా నా భార్యను 60 రోజుల పాటు వేరేచోట ఉంచారు. అనంతరం రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్తే అక్కడి ఎస్‌ఐ నన్నుకొట్టి, నీకు నచ్చిన వాడితో వెళ్లిపో అంటూ నా భార్యకు సలహా ఇచ్చారు. నా భార్య నన్ను వదిలి వంద రోజులైంది. ఆమె లేకుండా నేను బతకలేను, అందుకే మరణిద్దామనుకుని నిర్ణయం తీసుకున్నాను. మహిళ పీఎస్‌ వద్ద 3 గంటలకు ఆత్మహత్య చేసుకుంటాను. నేను చనిపోవడానికి కారణం మహిళ పీఎస్‌, రెండో పట్టణ ఎస్‌ఐలే’ అని అందులో పేర్కొన్నారు. చెప్పినట్టే ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.

తరచూ గొడవల నేపథ్యంలోనే..

ఈ విషయంపై మహిళా పీఎస్‌ డీఎస్పీ వాసుదేవ్‌ను వివరణ కోరగా.. భార్యాభర్తల మధ్య తరచూ గొడవల నేపథ్యంలో కౌన్సెలింగ్‌ ఇస్తున్నామన్నారు. పృథ్వీరాజు ఆరోపణలు అవాస్తవం అన్నారు. మహిళా ఎస్‌ఐ తప్పుకూడా లేదన్నారు. తనను వేధిస్తున్నాడని భార్య ఫిర్యాదు చేయడంతోనే వీరిద్దరికి కౌన్సెలింగ్‌ చేశామని రెండో పట్టణ ఎస్‌ఐ సిద్ధార్థ్‌ చెప్పారు. ఇలా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం నాలుగోసారి అని యువకుడి తల్లి పేర్కొన్నారు. కాగా పృథ్వీరాజుకు తాళ్లవలస గ్రామానికి చెందిన ఓ మహిళతో గతంలో వివాహమై పాప, బాబు ఉన్నారని, విభేదాల కారణంగా విడిపోయారని విచారణలో తేలింది. ఆ తర్వాత మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు వెల్లడైంది. మొదటి భార్యతో విడాకులు తీసుకోవాలని చెప్పడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: రెండు రోజులైతే పరీక్షలైపోతాయి ఇంటికొస్తానని...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.