రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. డప్పు రమేశ్ అనే వ్యక్తి తన రెండేళ్ల కుమారుడిని గొంతు కోసి కిరాతకంగా హతమార్చాడు. అనంతరం భార్య శోభను కత్తితో పొడిచాడు. మొయినాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. దంపతుల మధ్య గొడవలే కారణమని స్థానికులు చెబుతున్నారు. నిందితుడు రమేశ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
ఇదీచూడండి: Suicide : ఆత్మహత్య చేసుకోబోయి.. రెండు పాదాలు కోల్పోయి..