ETV Bharat / crime

ఉద్యోగాలు చేస్తున్నప్పుడు దొరకలే, ఫించన్లు తీసుకున్నపుడు దొరికాడు - ఒకే వ్యక్తి రెండు జాబులు చేశాడు

మూడో కంటికి అనుమానం రాకుండా రెండు ఉద్యోగాలు చేస్తూ రెండు చోట్లా రిటైర్​య్యాడు ఓ గనుడు . అక్కడితో ఆశ చల్లారక ఫించను కోసం రెండు చోట్ల అఫ్లీకేషన్​ పెట్టగా అసలు విషయం బయటకు పొక్కింది. దీంతో ఆయన పై కేసు నమోదుచేసిన పోలీసులు విచరణ చేపడుతున్నారు.

ఒకే వ్యక్తి రెండు జాబులు చేశాడు
one man working in two jobs
author img

By

Published : Aug 19, 2022, 12:38 PM IST

ఒక వ్యక్తి మూడో కంటికి అనుమానం రాకుండా రెండు ఉద్యోగాలు చేశాడు. ఆ రెండు చోట్లా రిటైర్‌య్యాడు కూడా. పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే జిల్లా ట్రెజరీ అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కిషన్‌పురాకు చెందిన ఎస్‌కే సర్వర్‌ రెండు వేర్వేరు తేదీల్లో పుట్టినట్టుగా ధ్రువపత్రాలు తీసుకొని ఒకటి కాకతీయ విశ్వవిద్యాలయంలో.. మరొకటి పోలీసుశాఖలో పెట్టి అటెండర్‌ ఉద్యోగాలు చేశాడు.

రెండు చోట్లా పదవీ విరమణ పొంది పింఛను కోసం డీటీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు పరిశీలిస్తున్నప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో డీటీవో.. వరంగల్‌ సీపీ తరుణ్‌జోషికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. రెండు చోట్లా ఒకేసారి ఉద్యోగాలు ఎలా చేశాడనేది విచారణలో తేలుతుందని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.