ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని ఓ తండాకు చెందిన మహిళను హత్య చేసి తల, కాళ్లు, చేతులు వేరు చేసి చేశాడు ఓ వ్యక్తి. మృతదేహాన్ని బస్తాలో కుక్కి... అడవి పంది కళేబరం అని వేరే వ్యక్తికి చెప్పాడు. అతని సాయంతో తీసుకెళ్లి గార్ల మండలం తిరులాపురం రైల్వేగేటు వద్ద పడేశారు.
సాయం చేయడానికి వచ్చిన వ్యక్తి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా... అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు గోప్యంగా దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇదీ చదవండి: కరోనా భయం... అంతిమ మజిలీ దారుణం