ETV Bharat / crime

MAN MISSING: ఆఫీసుకని వెళ్లాడు.. అప్పటి నుంచి నా భర్త కనిపించడం లేదు - telangana news

సికింద్రాబాద్​లోని చిలకలగూడ పోలీస్​ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యం అయ్యాడు. బుధవారం రోజు ఉదయం ఆఫీస్​కు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్థానికంగా ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతని భార్య పోలీసులను ఆశ్రయించారు.

MAN MISSING
MAN MISSING
author img

By

Published : Sep 30, 2021, 6:45 PM IST

ఆఫీసుకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్​లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న చంద్రయ్య అనే వ్యక్తి టాక్స్ కన్సల్టెంట్ కార్యాలయంలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. బుధవారం రోజు ఉదయం ఆఫీస్​కు వెళ్లిన అతను తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చంద్రయ్య ఫోన్ స్విచ్ ఉండడంతో కార్యాలయంలో ఆరాతీయగా పది రోజుల క్రితమే అతను ఉద్యోగం మానేసినట్లు తెలిపారు.

స్థానికంగా ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో చిలకలగూడ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. గత కొన్నాళ్లుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లు ఫిర్యాదులో అతని భార్య పేర్కొంది. అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

ఇదీ చదవండి: Dead Body in Musi river: మూసీలో కొట్టుకొచ్చిన మృతదేహం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.