ETV Bharat / crime

కుటుంబ కలహాలతో బావను హతమార్చిన బావమరిది - moosarambagh murder news

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన సొంత బావనే హత్య చేశాడు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన మూసారాంబాగ్​లో చోటుచేసుకుంది.

a man killed his brother in law with family quarrels at musarambagh
కుటుంబ కలహాలతో బావను హతమార్చిన బావమరిది
author img

By

Published : Mar 20, 2021, 5:20 PM IST

హైదరాబాద్ మూసారాంబాగ్‌లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మోసీన్​ అనే వ్యక్తి తన బావ హబీబ్​ను దారుణంగా హతమార్చాడు.

శుక్రవారం అర్ధరాత్రి హబీబ్‌ తన భార్యతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా అతని బావమరిది మోసీన్‌ అడ్డగించి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న హబీబ్​ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు మోసీన్​ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఉద్యోగం పేరుతో వ్యభిచారం.. ముగ్గురు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.