మహబూబాబాద్ జిల్లా అయోధ్య గ్రామ శివారులోని బావిలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడు. మృతుడు ఇందిరా కాలనీకి చెందిన బొల్లం నవీన్ ( 25 )గా పోలీసులు గుర్తించారు.
బావి వద్ద ఫోన్ రింగ్ అవుతుండడంతో వ్యవసాయ పనులకు పోయే రైతులు గమనించి మహబూబాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీశారు. మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు.
ఇదీ చదవండి:కామారెడ్డిలో యువకుడు అనుమానాస్పద మృతి