Car fire in Venkatapuram: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్‌లో కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటల్లో కాలిన వ్యక్తి భీమ్లా తండాకు చెందిన ధర్మగా గుర్తించారు. ఆయన హైదరాబాద్ సెక్రటేరియట్లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారని.. ఈ నెల 5న కుటుంబసభ్యులతో కలిసి తండాకు వచ్చారని తెలిపారు.
ఘటనా స్థలంలో పెట్రోల్ బాటిల్‌తో పాటు మృతునికి సంబంధించిన ఓ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు చనిపోయాడా.. లేదా ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు.
ఇవీ చదవండి: