ETV Bharat / crime

మొహర్రం వేడుకలో విషాదం అగ్నిగుండంలో పడి వ్యక్తి మృతి

Man fall in fire pit ఓ వ్యక్తి మద్యం మత్తులో పీర్ల పండుగ జరుపుకునే ప్రదేశానికి వచ్చాడు. అయితే మందులో మునిగి ఉన్న ఆ వ్యక్తి అక్కడ ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ఏపీలోని సత్యసాయి జిల్లాలో జరిగింది.

author img

By

Published : Aug 16, 2022, 8:00 PM IST

మొహర్రం వేడుకలో విషాదం అగ్నిగుండంలో పడి వ్యక్తి మృతి
మొహర్రం వేడుకలో విషాదం అగ్నిగుండంలో పడి వ్యక్తి మృతి

Man fall in fire pit: ఆంధ్రప్రదేశ్​లోని శ్రీ సత్యసాయి జిల్లా చెన్న కొత్తపల్లి మండలం బసంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో మొహర్రం సందర్భంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో ప్రమాదవశాత్తు పడి కనుముక్కల గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి మృతి చెందాడు. బసంపల్లిలో జరుగుతున్న పీర్ల పండుగకు వచ్చిన అతడు.. అగ్నిగుండం వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు అందులో జారిపడ్డాడు. మంటల్లో కాలిపోతున్న అతడిని స్థానికులు బయటకు లాగారు.

తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నర్సింహులు మరణించాడు. మద్యం మత్తులో అగ్నిగుండం దగ్గరకు వెళ్లి కాలుజారి గుండంలో పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి:

భూవివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ, 10 మందికి గాయాలు

స్టార్ క్రికెటర్​ ఆటకు వీడ్కోలు, సెలక్టర్స్​ వల్లే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.