ETV Bharat / crime

భార్య మరొకరితో వెళ్లిందని రైలు కిందపడి భర్త ఆత్మహత్య - సికింద్రబాద్​ రైల్వేేస్టేషన్​లో వ్యక్తి ఆత్మహత్య

Sucide in secunderabad railway station: నేటి కాలంలో వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. భార్య మరొకరితో వెళ్లిపోయిందని మనస్తాపంతో గూడ్స్ రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో చోటుచేసుకుంది

గూడ్స్ రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య
గూడ్స్ రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Feb 11, 2023, 12:16 PM IST

Sucide in secunderabad railway station: భార్య మరొకరితో వెళ్లిపోయిందని మనస్తాపంతో గూడ్స్ రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఛత్తీస్​గ‌ఢ్​కు చెందిన జైభజరంగ్ (32) స్థానికంగా కూలీ పనిచేస్తూ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య ఏడు రోజుల క్రితం పిల్లలను ఇంటి వద్ద వదిలిపెట్టి వేరొకరితో వెళ్లిపోయింది.

హైదరాబాద్​కు వచ్చి ఉంటుందని భావించిన అతను మూడు రోజుల క్రితం నగరానికి వచ్చి బంధువులను కలిశాడు. ఆమె జాడ తెలియకపోవడంతో తిరిగి సొంతూరుకు వెళ్లేందుకు బంధువులతో కలిసి గురువారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​కు చేరుకున్నాడు. వారు టికెట్ తెచ్చేందుకు వెళ్లగా రెండో నంబరు ప్లాట్​ఫాం నుంచి బయల్దేరి వెళ్తున్న గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా రైల్వే స్టేషన్ల్​లోనే ఉన్న మృతుడి బంధువుల ద్వారా జీఆర్పీ పోలీసులు తెలుసుకున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.